30-07-2025 12:30:22 AM
దోమకొండ, జూలై 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీబీ పేట మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు.
బిబిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలానికి సంబంధించిన మాందాపూర్, కోనాపూర్, బిబిపేట్ గ్రామస్తులకు చెందిన సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఇంద్రసేనారెడ్డి, రమేష్, నాగేశ్వరరావు,మండల నాయకులు, వివిధ గ్రామాల అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పోక్సో బాధితులకు చెక్కుల పంపిణీ
కామారెడ్డి, జూలై 29 (విజయ క్రాంతి), పోక్సో బాధితులు ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సాయంతో స్వల్పంగా పునరావాసం ఏర్పాటు చేసుకోవాలని జిల్లా అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో 13 మంది బాధిత కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. ప్రతి మహిళ, బాలిక గౌరవంగా స్వతంత్రంగా జీవించాలని భరోసా కేంద్రం ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ ఆర్థిక సాయంతో కుట్టుమిషన్లు కొనుగోలు చేయడం విద్యావసరాలు తీర్చుకోవడం ఆరోగ్య సంబంధ చికిత్సలు పొందడం స్వతహాగా జీవించేందుకు ఉపాధి సాధనాల కోసం వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డి సి ఆర్ పి సి ఐ మురళి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, ఉమెన్స్ ఎస్ ఐ జ్యోతి, భరోసా సెంటర్ కోఆర్డినేటర్ కవిత, ఇతర భరోసా సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు, బాధితుల ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఈ తక్షణ సహాయ నిధిని జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కే. నరసింహారెడ్డి బాధితులకు భరోసా నిధి చెక్కుల రూపంలో అందించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడు తూ: ఈ ఆర్థిక సాయంతో వారు స్వల్పంగా అయినా పునరావాసం ప్రారంభించగలరని ఆశిస్తున్నాం.
ప్రతి మహిళా మరియు బాలిక గౌరవంగా, స్వతంత్రంగా జీవించాలన్నదే భరోసా కేంద్రం యొక్క అభిలాష అన్ని అన్నారు. అలాగే, ఈ ఆర్థిక సహాయం బాధితులు కుట్టు మిషన్లు కొనుగోలు చేయడం, విద్యా అవసరాలు తీర్చుకోవడం, ఆరోగ్య సంబంధిత చికిత్సలు పొందడం, స్వతహాగా జీవించేందుకు ఉపాధి సాధనాల కోసం వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ మురళి, రిజర్వు ఇన్స్పెక్టర్ (అడ్మిన్) సంతోష్ కుమార్, ఉమెన్ ఎస్త్స్ర జ్యోతి, భరోసా సెంటర్ కోఆర్డినేటర్ కవిత, ఇతర భరోసా సిబ్బంది పాల్గొన్నారు.