calender_icon.png 1 August, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెజ్జంకిలో ఆహార భద్రత చట్టంపై సమీక్ష సమావేశం

30-07-2025 12:29:57 AM

రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యుడు ఆనంద్

బెజ్జంకి జులై29: ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని  ఆహార భద్రత కమీషన్ సభ్యుడు ఓరుగంటి ఆనంద్ హెచ్చరించారు.మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదిక యందు ఆహార భద్రత కమీషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, భారతి కలిసి మండలంలో అమలు చేస్తున్న ఆహార భద్రత చట్టం,మధ్యాహ్న భోజనం,

అంగన్వాడీల్లో గర్భీణీలకు అందించే పౌష్టికాహారం,వసతి గృహాల్లో విద్యార్థినిల ఆరోగ్య స్థితిగతులు, ఉపాధి హామి పథకం అయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో  డిప్యూటీ కలెక్టర్ హమీద్, డి ఎస్ ఓ తనూజ, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్,ఎంపీడీవో ప్రవీణ్,అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.