calender_icon.png 2 August, 2025 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనిచేసిన వారికే పట్టం

30-07-2025 12:31:12 AM

ఆత్మ కమిటీ ఛైర్మన్  రామలింగారెడ్డి

కోహీర్, జూలై 29:  రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ ప్రగతి కోసం కట్టుబడి నిరంతరం కృషి చేస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తామని ఆత్మ కమిటీ ఛైర్మెన్ రామలింగారెడ్డి తెలిపారు. మండలంలోని మాచిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన తహసీల్దార్ వరప్రసాద్ తో కలిసి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

గత ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందచేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రస్తుతం మండలంలో రేషన్ కార్డుల పంపిణీలో 3600 మందికి లబ్ధి చేకూరుతుందని తహసీల్దార్ వరప్రసాద్ తెలిపారు. కాగా ఈ నెల 31 తేదిన పదవి విరమణ చేయనున్న పశు సంవర్థక శాఖ అధికారి విష్ణు వర్ధన్ రెడ్డి సేవలను కొనియాడారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచయ్య, జహీరాబాద్ బ్లాక్ అధ్యక్షులు అర్షాద్ అలీ, బిలాల్ ఫూర్ సింగిల్ విండో ఛైర్మెన్ రియాజ్ , నాయకులు అడివిరెడ్డి, నరసింహా రెడ్డి, సురేందర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, వీరారెడ్డి, మల్లన్న పాటిల్, అశ్రఫ్ అలీ, సాయిలు, అజీమ్, అశోక్ పాల్గొన్నారు.