14 April, 2026 | 4:18 AM

విశ్వక్‌సేన్ సమర్పణలో..

14-04-2026 02:05 AM

ఎన్టీఆర్ ‘దేవర’తో సెన్సేషనల్ క్రియేట్ చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ మరో భారీ సినిమాను రూపొందిం చటానికి సిద్ధమైంది. విశ్వక్‌సేన్ హీరోగా నిర్మాత సుధాకర్ మిక్కిలినేని ఈ క్రేజీ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇంకా పేరు కాని ఈ సినిమాలో విశ్వక్‌సేన్ హీరోగా నటించటంతోపాటు సమర్పకుడిగానూ వ్యవరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు.

ఈ వేడుకలో ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ కొట్టగా, నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కెమెరా స్విచ్‌ఆన్ చేసి, స్క్రిప్టును టీమ్‌కు అందించారు. ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు రజత్ దర్శకత్వం వహిస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రాఫర్‌గా, తేజస్ కృష్ణ సంగీతం సమకూర్చతున్నారు. భాను భోగవరపు, నందు సవిరగాన డైలాగ్స్ రాస్తున్నారు.