21-01-2026 12:25:51 AM
సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా వేధింపులు సిగ్గుచేటు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు
గజ్వేల్ మాజీ జెడ్పిటిసి డాక్టర్ మల్లేశం
గజ్వేల్, జనవరి 20: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందునే మాజీ మంత్రి హరీష్ రావుపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నట్లు గజ్వేల్ మాజీ మాజీ జెడ్పిటిసి డాక్టర్ మల్లేశం ఆగ్ర హం వ్యక్తం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు హరీష్ రావుకు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ రాష్ట్రంలో సీట్ ఏర్పాటు చేయడం సిగ్గుచేటని నిలదీశారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమ కేసులను చూసితెలంగాణ ఉద్యమ కారులు భయపడతారని అనుకుంటే అది వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాం రాజకీయ ప్రతీకార చర్యలు తప్ప పేదల సంక్షేమo మర్చినట్లు విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అవినీతి పేరుకుపోగా, సీఎం రేవంత్ రెడ్డి సమైక్యవాదుల చేతుల్లో కీలుబొమ్మగా మారినట్లు ఆరోపించారు. బిఆర్‌ఎస్ నేతలపై కేసులు కాంగ్రెస్ దివాళా రాజకీయానికి అద్దం పడుతుండగా, ప్రజలే తగిన బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. బొగ్గు గనుల్లో కాంగ్రెస్ చీకటి ఒప్పందాలు బహిర్గతం చేసిన రోజునే హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వగా, సీఎం రేవంత్ రెడ్డి ఉడుత ఊపులకు భయపడేది లేదన్నారు.