08-05-2025 01:25:20 AM
న్యూఢిల్లీ, మే 7: పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన దాడుల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ..రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బుధవారం కలిశారు. ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు జరిపిన దాడుల గురించి రాష్ట్రపతికి ప్రధాని వివరించారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
నేడు అఖిలపక్ష సమావేశం..
‘ఆపరేషన్ సిందూర్’ తదనంతర పరిణామాలను ఆయా పార్టీల నేతలకు వివరించేందు కు కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. జాతీయ భద్రత విషయంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం.
రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్‌సింగ్, హోంమంత్రి అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు త దితరులు ఈ భేటీకి హాజరుకానున్నారు. పాకిస్థాన్‌పై భారత్ మెరుపుదాడులను విపక్షనేతలు స్వాగతించారు. పాకిస్థాన్ ఉగ్రచర్యలకు వ్యతిరేకంగా భారత్ తీసుకునే ఎలాంటి నిర్ణయాల కైనా తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.