08-05-2025 01:23:13 AM
న్యూఢిల్లీ, మే 7: భారత సైన్యం జరిపిన దాడుల్లో జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ మసూద్ అజార్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. అంతర్జాతీ య సరిహద్దుకు 100 కి.మీ దూరంలోని బహవల్‌పూర్ మర్కాజ్ సుబాన్‌లోని ఆ ఉగ్రవాద స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతిచెందారు. వీరిలో 10 మంది మసూద్ కుటుంబ సభ్యులే కావడం గమనార్హం.
మృతు ల్లో మసూద్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతడి భార్య, మేనకోడలితో పాటు మరో ఐదుగురు ఉన్నట్లు తెలిసింది. పూల్వామా దాడికి కూడా మసూద్‌నే పథక రచన చేశాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. వ్యూహరచనకు మసూద్ బహవల్‌పూర్ మార్కాజ్ సుబాన్‌లోని స్థావరాన్నే వినియోగిస్తాడని తెలిసింది. ప్రస్తుతం ఈ స్థావరంలో 600 మంది ఉగ్రవాదులు ఉంటున్నట్లు సమాచారం.