calender_icon.png 14 September, 2025 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విమర్శలకు కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది

14-09-2025 01:46:22 PM

దరాంగ్: అస్సాం(Assam)లోని దరాంగ్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) ఆదివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.6,300 కోట్ల విలువైన ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. దరాంగ్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్, నర్సింగ్ కాలేజీ, జిఎన్‌ఎం స్కూల్ నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే రూ.570 కోట్ల వ్యయంతో 2.9 కి.మీ పొడవైన నరేంగి-కురువా వంతెనకు శంకుస్థాపన చేశారు. అస్సాంలోని కామ్‌రూప్, దరాంగ్ జిల్లా, మేఘాలయలోని రి భోయ్‌ను కలిపే 118.5 కి.మీ పొడవైన గౌహతి రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ఖర్చు రూ.4,530 కోట్లుగా అంచనా వేయబడింది. 

శంకుస్థాపనల అనంతరం మోడీ మాట్లాడుతూ.. 1962లో చైనా చొరబాటు సమయంలో నెహ్రూ సర్కార్ అనేక తప్పిదాలు చేసిందని.. నెహ్రూ సర్కార్ తప్పిదాల ఫలితాలను ఇప్పటికీ అస్సాం ప్రజలు అనుభవిస్తున్నారని తెలిపారు. భారతరత్న అవార్డు గ్రహీత హజారికపై కాంగ్రెస్ విమర్శలు దారుణమని.. అస్సాం పుత్రుడు భూపేన్ హజారికను కాంగ్రెస్ తీవ్రంగా అవమానించిందని అన్నారు. అస్సాంలో డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల 13 శాతం వృద్ధిరేటు సాధ్యమైందని.. అలాగే విమర్శలకు కాంగ్రెస్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుందని పేర్కొన్నారు. తాను శివ భక్తుడిని అని.. విమర్శల విషయాన్ని దిగమింగుతానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.