14-09-2025 02:14:22 PM
చిట్యాల (విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను సిపిఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం గుండ్రాంపల్లి గ్రామంలో నిర్వహించారు. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన అమరవీరుల ప్రాణ త్యాగాలను గుర్తు చేసుకుంటూ, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలో నిర్వహించారు. పార్టీ జెండా ఆవిష్కరించి, అమరవీరుల త్యాగాలకు గుర్తుగా పార్టీ దిమ్మపై పూలమాలలు వేశారు. సిపిఐ (ఎం) పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో గుండ్రంపల్లి గ్రామానికి ప్రత్యేకమైన స్థానం ఉందని, ఆనాడు రజాకారుల దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారని, వారి త్యాగం మరువలేనిదని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకుడు బొంతల చంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, జిల్లా కమిటీ సభ్యుడు జిట్టా నగేష్, అవిశెట్టి శంకరయ్య, బొజ్జ చిన్న వెంకులు, వెంకన్న, మారయ్య, పెంజర్ల సైదులు మండల సహాయ కార్యదర్శి కత్తుల లింగస్వామి, మండల కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల కార్యదర్శులు, శాఖ కార్యదర్శి కత్తుల యాదయ్య, జోగు లక్ష్మయ్య ఎండి జాంగిర్, కూరాకుల అంజయ్య, పెన్నింటి నారాయణరెడ్డి, రేడపాక మల్లయ్య, రత్నం యాదయ్య, బుస్సు సత్యం, సర్గాల మల్లేష్, జోగు గణేష్, విక్రమ్, మైదిన్, వెంకటేష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.