14-09-2025 02:11:43 PM
గార్ల/మహబూబాబాద్ (విజయక్రాంతి): యూరియా సరఫరా కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా యూరియా పంపిణీ చేయాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్(District SP Sudhir Ramnath Kekan) అధికారులను ఆదేశించారు. ఆదివారం మండల పరిధిలోని ముల్కనూర్ రైతు వేదికలో యూరియా పంపిణీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గత సంవత్సరంలో సాగు, ఈ ఏడాది సాగును అంచన వేసుకొని దానికనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు యూరియా తెప్పించుకోవాలని అన్నారు. ఇప్పటిదాకా ఎంత యూరియా అందింది,ఇంకా ఎంత అవసరం అవుతుందని రైతులను అడిగి తెలుసుకున్నారు.
గోదాంలో ఉన్న ఎరువులను కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే పంపిణీ చేయాలని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.యూరియా పంపిణీ సజావుగా జరిగేలా చూడాలని పంపిణీని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు, గార్ల, బయ్యారం సిఐ రవికుమార్, ఉపేందర్,ఎస్సై రియాజ్ పాషా, ఏఈఓ మేఘన, సొసైటీ సీఈవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.