calender_icon.png 14 September, 2025 | 3:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత సామరస్యాన్ని పాటించుకోవాలి

14-09-2025 01:51:45 PM

వన్ టౌన్ సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): మత సామరస్యాన్ని పాటించుకుంటూ ప్రశాంత వాతావరణంలో ర్యాలీ నిర్వహించుకోవాలని వన్ టౌన్ సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి(CI Emi Reddy Rajasekhar Reddy) తెలిపారు. మిలాద్ ఉన్ నబీ పురస్కరించుకొని ఆదివారం నల్లగొండ పట్టణంలోని సయ్యద్ లతీఫ్ షావలి ప్రాంగణంలో మిలాద్ జులూస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మిలాద్ జులుస్(ర్యాలీ)ని జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. ఈ ర్యాలీ దర్గా మెట్ల వద్ద ప్రారంభమై క్లాక్ టవర్, ఆర్పి రోడ్డు, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, ఓల్డ్ సిటీ చౌరస్తా, న్యూ ప్రేమ్ టాకీస్, ప్రయాణించి దర్గా మెట్ల వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో ఎస్సై సతీష్, కమిటీ పెద్దలు, మైనార్టీ యువకులు  పాల్గొన్నారు.