ట్రంప్ నియంత్రణలో ప్రధాని
- బీజేపీ, ఎల్డీఎఫ్ కుమ్మక్కు
కేరళ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ
తిరువనంతపురం, ఏప్రిల్ 4 : ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియంత్రణలో ఉన్నారని, ఆయన్ను సర్ అని పిలుస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమ ర్శించారు. కేరళం ఇడుక్కిలో శనివారంనాడు జరిగిన ఎన్నికల ప్రచారసభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. బీజేపీ, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మోదీని ట్రంప్ నియంత్రిస్తున్నట్లే పినరయి విజయన్‌ను ప్రధాని నియంత్రిస్తున్నారని విమర్శిం చారు.
లెఫ్ట్ ఫ్రంట్‌లో సిద్ధాంతాల కోసం ఏళ్లతరబడి పనిచేసిన వారు ఇప్పుడు పార్టీ వంచించిందని ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో కుమ్మక్కయినందునే ఎల్డీఎఫ్ తన వామపక్ష భావ జాలాన్ని కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ సై ద్ధాంతిక ప్రత్యర్థిగా ఎల్డీఎఫ్‌తో పోరాడేదని ఇప్పడు ఎల్డీ ఎఫ్‌లో లెఫ్ట్ అనేదే లేకుండా పోయిందన్నా రు.
ప్రధాని ఏ రాష్ట్రానికి వెళ్లినా మతం, ఆలయాల గురించి మా ట్లాడతారని, కేరళ విష యానికి వచ్చేసరికి మాత్రం పెదవి విప్పరని, శబరిమల బంగా రం కేసు ఏమైందని నిలదీశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో పోరాడుతు న్నందుకు తనపై చాలాకేసులు పెట్టారని ఆయన తాను వెనక్కు తగ్గలేదన్నారు. కేరళ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు.




