09-10-2025 12:00:00 AM
మహబూబ్ నగర్ టౌన్, అక్టోబర్ 8: ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వి రాజేంద్రప్రసాద్ అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ గా సిసిఈ తెలంగాణ లో అదనపు బాధ్యతలు చేపట్టి బుధవారం కళాశాలకు విచ్చేసిన సందర్భంగా కళాశాల స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ సన్మాన కార్యక్రమాన్ని ఉద్దేశించి అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని, ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అధ్యాపక,అధ్యాపకేతర సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఎం వి ఎస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పద్మావతి, జడ్చర్ల కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుకన్య,కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.