calender_icon.png 10 October, 2025 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి

09-10-2025 12:00:00 AM

తహసీల్దార్లతో కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సమీక్ష 

కాగజ్‌నగర్, అక్టోబర్ ౮ (విజయక్రాం తి): భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం  కాగజ్ నగర్ పట్టణంలోని సబ్ కలెక్ట ర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్  డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా లతో కలిసి భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై డివిజన్ లోని మండలాల తహసిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి గ్రామసభలలో అందిన ప్రతి దరఖాస్తును రికార్డుల తో సరిచూసి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా  పరిశీలించాలన్నారు. పేరు, తండ్రి పేరు, ఇంటిపే రు, విస్తీర్ణం, విరాసత్ పట్టా మార్పిడి, డిజిటల్ సంతకం కొరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. దరఖాస్తులను పెండింగ్ లేకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని తెలిపారు. అనంతరం మం డలాల వారీగా పెండింగ్ దరఖాస్తుల వివరాలపై సమీక్షించారు.

అనంతరం2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రంలో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే  కాగజ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జెడ్‌పిటిసి స్థానాల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్  డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ లతో కలిసి సందర్శించి కౌంటింగ్ చేపట్టే గదులు, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎం పి టి సి, జెడ్ పి టి సి స్థానాల కౌంటింగ్ కార్యక్రమాన్ని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్నందున రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ గదులలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. కౌంటింగ్ నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని, అధికారులు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా తమ ఓటును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.