09-10-2025 12:00:00 AM
-బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన
-పెండింగ్ బిల్లుల కోసం ఆందోళన
ఆదిలాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాం తి): బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం పేరిట తమ పిల్లలను ఎటు కాకుండా చదువుకు దూరం చేస్తున్నారని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలను స్కూలుకు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 సంవత్సరాల నుండి పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజులు చెల్లించాలని తమ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
మావల మండ లంలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్ కృష్ణవేణి రెసిడెన్షియలల్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులు, తమ కుటుంబ సభ్యులతో స్థాని క ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు పేరెంట్స్ బెస్ట్ అవైలేబుల్ స్కూల్ పథకం ద్వారా 150 విద్యార్థులు అడ్మిషన్ పొందిన కృష్ణవేణి రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల ఫీజులు 2022 2023- విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వం నుండి ఫీజులు చెల్లించలేని పాఠశాల యాజమాన్యం తమ విద్యార్థులను స్కూలుకు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గత 2 సంవత్సరాల నుండి పెండింగ్ ఫీజులు రాకపోవడంతో విద్యా సంస్థను నడపడం కష్టంగా ఉందనీ, కాబట్టి ఏ సమయములోనైన అడ్మిషన్లు రద్దు చేస్తామని స్కూల్ యాజమాన్యం బెదిరించడంతో విద్యా సంవత్సరం అర్ధాంతరంగా ముగిస్తే తమ పిల్లల భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు. కావున ప్రభుత్వం వెంటనే పెండింగ్ ఫీజులను విడుదల చేసి, తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.