13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ట్రాఫిక్ కంటే చలాన్లకే ప్రాధాన్యం

01-04-2026 12:00 AM

ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు బదులు చలాన్ల వసూళ్లు

నాగోల్, మార్చి 31 (విజయక్రాంతి): నగరంలోని ఎల్బీ నగర్ ప్రాంతంలో ట్రాఫిక్ నిర్వహణ విధానాలపై వాహనదారుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రాఫిక్ నియంత్రణ కంటే చలాన్ల విధానంపై ఎక్కు వ దృష్టి పెట్టడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. ప్రత్యేకంగా రద్దీ సమయాల్లో ట్రాఫిక్ను సజావుగా నడిపే చర్యలు తగ్గిపోవడం, అదే సమయం లో వాహనాలను ఆపి తనిఖీలు చేయడం వల్ల ట్రాఫిక్ నిలిచిపోతుందని వాహనదారులు చెబుతున్నారు.

దీనివల్ల ప్రయాణ సమయం పెరిగి, రోజువారీ పనుల్లో అంతరాయం కలుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా, కొంతమంది ట్రాఫిక్ సిబ్బంది ప్రవర్తనపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పత్రాలు తనిఖీ చేసే సమయంలో మర్యాదగా వ్యవహరించకపోవడం, చిన్నపాటి తప్పిదాలకే కఠినంగా వ్యవహరించడం వంటి అంశాలు ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయ ని అంటున్నారు.

ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగా పని చేయని ప్రాంతాల్లో మార్గనిర్దేశం లేకపోవడం, పార్కింగ్ సదుపాయాల కొరత వంటి సమస్యలు కూడా పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు ట్రాఫిక్ వ్యవస్థలో సమన్వయం అవసరమని భావిస్తున్నారు. నిబం ధనలు పాటించడం అవసరం. అయితే అవి ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా అమలు చేయాలి. ట్రాఫిక్ నియంత్రణపై మరింత దృష్టి పెట్టి, సౌకర్యవంతమైన ప్రయాణానికి చర్యలు తీసుకోవాలి అని వాహనదారులు కోరుతున్నారు.