1 April, 2026 | 2:37 AM

జగిత్యాల జిల్లాలో వసూల్ రాజా

01-04-2026 12:00 AM

జిల్లాలో దశాబ్ద కాలంగా తిష్ట

మామూళ్ల కోసం టీచర్లు ఆయాలను వదలని ఘనుడు 

కూతురు పెళ్లికి టీచర్లు అయాల నుండి వసూళ్లు 

మంత్రి దెబ్బకు జిల్లా వదిలిన అధికారి 

ప్రమోషన్ల పేరిట వసూళ్లు 

ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ఆడియోలో గోడు వెళ్ళబోసుకున్న అంగన్వాడీ టీచర్లు 

గత నెల 28న విచారణకు వచ్చిన ఆర్జెడి 

మెట్ పల్లి, మార్చి 31(విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలో ఆయన దశాబ్ద కాలంగా తిష్ట వేసి భారీగా వసూళ్లకు పాల్పడు తున్నారని ఏళ్లుగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఎ న్ని పిర్యాద్ లు చేసిన అవి భూట్టధకాలు అ య్యాయానే వాదనలు ఉన్నాయి. దీర్ఘ కాలం గా ఆయన జిల్లాలో ఐసిడిఎస్ తో పాటు వివిధ శాఖలలో తిష్ట వేయడం తనకు రాజకీయ పలుకుబడి ఉందంటూ చెప్పుకునే ఆయన తాను అడిగిన మమ్ముళ్లు రాకుంటే వారిని ఉద్యోగాల నుండి తొలగించినట్టు ఆరోపణలు ఉన్నాయి.వివరాలలోకి వెళ్తే 

పిర్యాద్ పై రెండేళ్లకు విచారణ

గతంలో జిల్లా సంక్షేమ అధికారిపై రెండు సంవత్సరాల క్రితం జగిత్యాల జిల్లాలోని కొందరు అంగన్వాడీ టీచర్లు మహిళా కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాద్ మేరకు మార్చి 28 శనివారం రోజు ఐసిడిఎస్ రీజనల్ జాయిం ట్ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మీ విచారణ కు రావ డం విమర్శలకు తావిచ్చింది. తాను విచారణకు వస్తున్నట్లు ఆర్జెడి ముందే సమాచారం ఇవ్వడం తో జగిత్యాల జిల్లా కేంద్రంలోని కా ర్యాలయంలో పని చేసే ఒక మహిళ ఉద్యోగి ఒకరు తమ మాట వినే అంగన్వాడీ టీచర్లను ఎంక్వయిరీ స్థలానికి రప్పించినట్లు ఆరోపణ లు వినిపిస్తున్నాయి.

ప్రతి మండలం నుండి నలుగురు అంగన్వాడీ టీచర్లను వారిలో ము ఖ్యంగా అంగన్వాడీ టీచర్ల యూనియన్ నాయకులను పిలిపించినట్లు తెలిసింది. ఆయా మండలాల నుండి వచ్చిన అంగన్వాడి టీచర్లకు తెల్ల కాగితం పెన్ను ఇచ్చి అవినీతి ఆరో పణలు ఎదుర్కొంటున్న అధికారికి అనుకూలంగా రాయించుకొని వెళ్లినట్లు పలువురు అంగన్వాడి టీచర్లు ఆరోపించడం గమనా ర్హం. గతంలో పిర్యాద్ చేసిన జగిత్యాల పట్టణానికి చెందిన కొంతమంది టీచర్లు మాత్రం ఫిర్యాదు చేసింది నిజమే అయితే రెండు సంవత్సరాల తర్వాత ఏం జవాబు చెప్పమంటారు అంటూ ఆర్జెడితో వాగ్వివాదానికి దిగి నట్లు తెలిసింది.

జిల్లా సంక్షేమ అధికారిగా ఇక్కడ పని పనిచేసిన ఆయనపై అనేక అవినీతి, వేధింపుల ఆరోపణలు వచ్చినప్పటికీ తనకు ఉన్న పలుకుబడితో వాటిని తొక్కి పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా కొన్ని రోజుల క్రితం నేరుగా పిర్యాద్ చేస్తే తమను వేదిస్తారనే భయంతో కొందరు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ఆడియోలో తమ గోడు వెళ్ళబోసుకుంటూ ఆడియో వదలడంతో రెండు సంవత్సరాల క్రితం ఇచ్చిన పిర్యాద్ పై విచారణ కు వచ్చినట్లు తెలిసింది.

లక్షల రూపాయల వసూళ్ల ఆరోపణలు

జిల్లా సంక్షేమ శాఖ అధికారితో పాటు, కొందరు సిడిపివోలు, సూపర్వైజర్లులు కుమ్మక్కు అయి, అంగన్వాడీ టీచర్లు, ఆయ లా నుండి బలవంతంగా అక్రమ వసూళ్లకు పాల్పడు తున్నారనె ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సూపర్వైజర్లు, సిడిపీవోలు వివిధ పేర్లతో ఒక్కో సెంటర్ నుంచి వెలకు వెలు డబ్బులు వసూలు చేస్తూ అంగన్వాడీ టీచ ర్లు, ఆయాలను ఒత్తిడి గురి చేస్తూ ఇవ్వని టీచర్లను మెమో ల పేరా వేధింపులకు పాల్పడుతున్నారనె ఆరోపణలు ఉన్నాయి.అలాగే మెట్ పల్లి ప్రాజెక్ట్ తో పాటు జిల్లా లోని మండల కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులను లక్షల రూపాయలు వసూ ల్ చేసి అర్హత లేని ఆయాలకు అంగన్వాడీ టీచర్ గా ప్రమోషన్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ఆడియోలో గోడు

బదిలీ అయిన ఉన్నతాధికారి కూతురు పెళ్లి కోసం జగిత్యాల జిల్లా లో ప్రాజెక్ట్ ల వారిగా లక్షల రూపాయల టార్గెట్ పెట్టి వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేసవి సెలవుల సమయంలో జీతా లు వచ్చాయని కారణం చూపుతూ ప్రతి సెంటర్ నుంచి టీచర్ వెయ్యి , ఆయా నుండి ఐదు వందల రూపాయల చొప్పున వసూల్ చేసినట్లు ఆడియో రికార్డ్ లో ఆరోపణలు ఉన్నావి. అలాగే ప్రభుత్వం చెల్లించిన బిల్లులపై కూడా వసూల్ చేశారని ,బతుకమ్మ కార్యక్రమం పేరుతో,దసరా జనవరి నూతన సంవత్సరం బహుమతుల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆ ఆడియో లో ఆరోపణలు చేశారు.డబ్బులు ఇవ్వని సిబ్బందిని బెదిరించి టార్గెట్ చేస్తామని కొంతమంది అధికారులు హెచ్చరిస్తున్నారని బాధితులు వెల్లడించారు.

వేధింపులపై మంత్రికి పిర్యాద్ 

తనను వేదిస్తున్నారని న్యాయం చేయాలనీ మంత్రి అడ్లూరి లక్ష్మన్ పెగడపల్లి మండలం బతికేపల్లి అంగన్వాడీ టీచర్ జమున శరణు జోచ్చారు.గత ఏడాది జులై పదినా తన అంగన్వాడీ కేంద్రానికి డిబ్ల్యూఓ తో పాటు సిడిపివో, కొందరు సూపర్వైసార్లు కలిసి వచ్చి విజిట్ చేశారని తెలిపారు. అలాగే స్టాక్ స్టేటస్ రాసి ఇవ్వమని ఆయన కోరగా రెండు కిలోల బియ్యం, నాలుగు వందల ఎనభై ఐదు గ్రాముల పప్పు తక్కువ ఉన్నట్లు రాసి ఇచ్చినట్లు తెలిపింది.తీరా ఆగస్టు ఎనిమిదిన తనను ఉద్యోగం నుండి తొలగించినట్లు లెటర్ తన చేతిలో పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దింతో ఆమె హైకోర్టు ను ఆశ్రయించగా కోర్ట్ మళ్ళీ ఆమెను ఉద్యోగం లోకి తీసుకోవాలని తెలిపింది.

కాని జమునను ఎంతకు జాయిన్ చేసుకోక పోవడంతో ఆమె మంత్రి అడ్లూరి లక్ష్మన్ ను కలిసి తన గోడు వెళ్ళబోసుకుంది. మంత్రి సదర్ అధికారికి ఫోన్ చేసి ఆమెను జాయిన్ చేసుకోవాలని కోరగా మళ్ళీ జమున జగిత్యాల ఐసిడిఎస్ కార్యాలయానికి వెళ్లారు. జిల్లా అధికారి మంత్రి చెబితే నేను వినాలని రూల్ లేదు ఎం చేసుకుంటావో చేసుకో లేదా లక్ష రూపాయలు ఇస్తే జాయిన్ చేసుకుంటాను లేకుంటే మళ్ళీ మంత్రికి చెప్పుకో అని ఆయన అన్నట్లు జమున తెలిపింది. ఈ విషయం మంత్రి కి తెలియడంతో ఆయన సదర్ ఐసిడిఎస్ అధికారి వెటర్నరీ డిపార్ట్మెంట్ నుండి వచ్చి ఇన్ని రోజులు ఇక్కడ ఎందుకు ఉన్నాడని రాష్ట్ర అధికారులను అడిగినట్లు తెలిసింది.

దింతో సదర్ అధికారిని మళ్ళీ తమ పాత డిపార్ట్మెంట్ వెటర్నరీ శాఖ కు పంపినట్లు ప్రచారం జరుగుతుంది.ఏళ్లుగా అనేగా అవినీతి కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారిన జిల్లా సంక్షేమ శాఖ లో సదరు అధికారి వల్ల అనేక అక్రమాలకు తెరలేచిందని జిల్లా వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నప్పటికీ సదర్ అధికారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సర్వత్ర విమర్శలకు తావిస్తున్నది.జగిత్యాల జిల్లా అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమ వసూళ్లు, ప్రమోషన్ లపై క్షేత్ర స్థాయిలో విచారణ జరిగితే మరింత అవినీతి లెక్కలు బయటపడే అవకాశం ఉందని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కోరుతున్నారు.