13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

క్యాన్సర్ రోగులకు నాణ్యమైన వైద్యమే లక్ష్యం

01-04-2026 12:00 AM

బంజారాహిల్స్, మార్చి 31(విజయక్రాంతి): క్యాన్సర్ రోగులకు ప్రపంచ శ్రేణి ఆధునిక చికిత్స అందించాలనే లక్ష్యంతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ మ రో ముందడుగు వేసింది. పలు కార్పొరేట్ సంస్థలు తమ సామాజిక బాధ్యత నిధులతో అందించిన విరాళాల ద్వారా రోగులకు నాణ్యమైన సేవలు అందించడానికి వీలుగా ఆసుపత్రిలో పలు ఆధునిక వైద్య సదుపాయాల ఏర్పాటు చేశారు. ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ముఖ్య ఆహ్వానితులుగా పాల్గొని ఈ నూతన పరికరాలను ప్రారంభించారు.

ఆసుపత్రిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అల్ట్రా సౌండ్ యం త్రాన్ని ప్రవేశపెట్టారు. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తమ సిఎస్‌ఆర్ నిధులతో దీనిని అందజేసింది. ఏకం ఫౌండేషన్, ఎస్బీఎఫ్సీ సంస్థలు సంయుక్తంగా ఈ ఆంబులెన్స్‌ను విరాళంగా ఇచ్చాయి. ఈ గొప్ప కార్యానికి సహకరించిన ఎస్బీఎఫ్సీ ప్రతినిధులు శ్రీనివాస్ మైలవరపు, భాస్కర్ సాదులను బాలకృష్ణ ప్రత్యే కంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ట్రస్ట్ బోర్డు సభ్యురాలు నారా బ్రాహ్మణి బిడిఎల్ సిఎండి కమెడోర్ ఎ.మాధవరావు, బిడిఎల్ ఉన్నతాధికారులు జి.గాయత్రి ప్రసాద్, సత్యనారాయణ, డాక్టర్ ఝాన్సీ రాణి, పి. శ్రీనివాసరావు, డాక్టర్ టి.ఎస్ రావు, సి.ఓ.ఓ రావి శ్రీనివాస రావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు జె.ఎస్.ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.