30 June, 2026 | 2:11 AM

ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలి

30-06-2026 01:18 AM

సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 29: ప్రజావాణిలో వచ్చే అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే   పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ కె.లక్ష్మీ కిరణ్  అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలు మండలాల నుండి 162 అర్జీలు అందాయి. ప్రజలు తమ సమస్యలు అధికార యంత్రాంగం ద్వారా తప్పక పరిష్కారం అవుతాయనే విశ్వాసంతో ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నారని ప్రతి శాఖ అధికారి దరఖాస్తులను పరిష్కరించి  చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.