13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

జీహెచ్‌ఎంసీ ఉద్యోగులను వేధిస్తే సహించం

27-03-2026 02:29 AM

మలక్‌పేట్, మార్చి 26 (విజయక్రాంతి): కార్మికులు, ఉద్యోగులను అకారణంగా వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని జిహెచ్ ఎంసి మున్సిపల్ సహకార మజ్దూర్ యూనియన్(ఐఎన్‌టియుసి) వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిల్ షరీఫ్ అన్నారు. గురువారం మలక్పేటలోని జిహెచ్‌ఎంసి సర్కిల్ కార్యాలయం లో వివిధ యూనియన్లకు చెందిన ఉద్యోగులు ఆదిల్ షరీఫ్ ఆధ్వర్యంలో ఐఎన్టీయూ సీల చేరారు.

ఈ సందర్భంగా ఆదిల్ షరీఫ్ మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి విభజన, అదనపు సర్కిల్‌లా ఏర్పాటుతో ఉన్న ఉద్యోగుల పై పని భారం తీవ్రతరమైందని ఆయన అ న్నారు. అధికారులు కావాలని తమ కార్మికు లు, ఉద్యోగులను పని ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆయన ద్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జనరల్ సెక్రటరీ, మహి ళా విభాగ అధ్యక్షురాలు పల్లవి పాల్గొన్నారు.