11 August, 2026 | 2:29 AM

ట్రాఫిక్ నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలి

11-08-2026 01:20 AM

సైబరాబాద్ సీపీ రమేష్

శేరిలింగంపల్లి, ఆగస్టు 10 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కన్వర్జెన్స్ సమావేశంలో ట్రాఫిక్, రహదారి మౌలిక వసతులు, వర్షాకాల సమస్యలను సమీక్షించారు. సైబరాబా ద్ సీపీ ఎం. రమేష్ ఐపీఎస్, సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఏఎస్తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొత్తం 33 4 రహదారి పనులను సమీక్షించి, 245 చోట్ల గుంతలు పూడ్చాలని, 25 ఫుట్ ఓవర్ బ్రి డ్జిలు, 65 సైన్బోర్డులు, 9 ఆక్రమణ ప్రాంతాలు, 53 ఫుట్పాత్లు, 13 రహదారి విస్తరణలు, 85 నీరు నిలిచే ప్రాంతాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అన్ని శాఖలు కాలపరి మితిలో పనులు పూర్తి చేసి, పాదచారుల భ ద్రత, ట్రాఫిక్ నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక ఐఏఎస్, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్బీ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఐఏఎస్, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ ఐఏఎస్, జాయింట్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్తో పాటు అన్ని జోన్ల జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా అధికారులు హాజరయ్యారు.