27-08-2025 01:07:20 AM
నల్లగొండ టౌన్, ఆగస్టు 26 (విజయక్రాంతి): బాలికపై లైంగికదాడి ఘటనలో నమోదైన పోక్సో కేసులో నేరస్థుడికి 51 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2021లో తిప్పర్తి మండలానికి చెందిన 12 ఏళ్ల బాలిక బడి నుంచి ఇంటికి వస్తుండగా తిప్పర్తికి చెందిన షేక్ మహమ్మద్ ఖయ్యూం (32) బలవంతంగా తన బండిపై ఎక్కించుకుని, ఓ పాడుబడ్డ ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పట్లో కేసు నమోదు చేశారు.
మూడున్నర సంవత్సరాల పాటు సాగిన విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు ఇన్చార్జి జడ్జి రోజారమణి మంగళవారం 51 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తుది తీర్పు ను వెల్లడించారు. లైంగిక దాడి కేసులో 20 ఏళ్లు, పోక్సో కేసులో 20 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు లో పదేళ్లు, సెక్షన్ 506(మైనర్ బాలికపై బెదిరింపు లు) కేసులో మరో ఏడాది శిక్ష విధిస్తూ న్యాయమూ ర్తి సంచలన తీర్పు వెల్లడించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో న్యాయస్థానికి సరైన ఆధారాలు సమర్పించడంతో నేరస్థుడికి శిక్ష పడింది.