calender_icon.png 5 July, 2025 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముద్దాయికి జైలుశిక్ష

05-07-2025 01:27:03 AM

తుంగతుర్తి, జూన్ 4: మెడలో నుంచి గొలుసు అపహరించిన కేసు విషయంలో ముద్దాయికి జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తుంగతుర్తి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు   న్యాయమూర్తి ఎండి గౌస్ పాషా తీర్పు చెప్పారు. కేసుకు సంబంధించిన వివరాలు...

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని బాపనబాయి తండాకు చెందిన లకావత్ తార ఏప్రిల్ 23 2021 నాడు వ్యవసాయ పనులు చేసుకొని ఇంటికి వస్తూ ఉండగా మండలంలోని గానుగ బండకు చెందిన పోలెపాక రమేష్ ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసును అపారించుకొని వెళ్ళాడు ఈ విషయమై ఆమె తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్త్స్ర డేనియల్ కుమార్ కేసు నమోదు చేశారు .

ఆ తర్వాత వచ్చిన ఎస్‌ఐ ఏడుకొండలు, క్రాంతి కుమారులు దర్యాప్తు జరిపారు. నిందితుడు నుండి గొలుసును స్వాధీనం చేసుకొని కోర్టు ద్వారా బాధితురాలకు అప్పగించారు. కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా శుక్రవారం న్యాయమూర్తి కేసును విచారణ చేసి సాక్షదా రా లను పరిశీలించిన అనంతరం నిందితునికి ఏడాది పాటు జైలు శిక్ష విధించారు. కేసు విచారణకు సహకరించిన పిపి లక్ష్మణ్ నాయకులు మరియు కోర్ట్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ ను అధికారులు అభినందించారు