05-07-2025 01:59:03 PM
డిసిసిబి సొసైటీ చైర్మన్ గుడిపాటి సైదులు
తుంగతుర్తి, విజయక్రాంతి: సహకార సొసైటీ సేవలను రైతులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని సొసైటీ చైర్మన్ డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు అన్నారు. అంతర్జాతీయ సహకార దినోత్సవం(International Co-operative Day) సందర్భంగా శనివారం తుంగతుర్తి రైతు సేవా సహకార సంఘం కార్యాలయం లో సహకార జెండాను ఎగరవేసి మాట్లాడారు. సహకార సొసైటీలో రైతులకు ఎరువులు విత్తనాలు లోన్లు సకాలంలో అందజేస్తున్నారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి లోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి డిసిసిబి బ్రాంచ్ మేనేజర్ సుధాకర్ అసిస్టెంట్ మేనేజర్ రవీందర్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ మోడం శ్రీలత సొసైటీ డైరెక్టర్లు యాదగిరి, రామచంద్రు,మజీదు, బిక్షం రెడ్డి, రామనరసమ్మ, ఇదప్ప, యాకయ్య, కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, సొసైటీ ఇన్చార్జి కార్యదర్శి యాదగిరి, మహేష్,ఉమేష్, మాజీ సీఈవో వందనపు వెంకటేశ్వర్లు, మందల ప్రభాకర్, రైతులు పాల్గొన్నారు.