calender_icon.png 5 July, 2025 | 6:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాపారం చేసుకునే మహిళలను ప్రోత్సహిస్తున్నాం: భట్టి విక్రమార్క

05-07-2025 01:56:31 PM

అవకాశం ఉన్న ప్రతిచోటా మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తాం

హైదరాబాద్: మా ప్రభుత్వం మహిళా సంఘాలకు(Women's Associations) అండగా ఉంటుంది.. వ్యాపారం చేసుకునే మహిళలను ప్రోత్సహిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పేర్కొన్నారు. ప్రజాభవన్ లో ఇందిరా శక్తి సంబరాలు నిర్వహించారు. ఆర్టీసీ అద్దెబస్సులు అందించిన మహిళా సంఘాలకు మంత్రులు చెక్కులు అందించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... కోటి మంది మహిళలను కోటీశ్వర్వులు చేయాలనే లక్షంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. ఐదేళ్లలో మహిళలను రూ. లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలనేదే తమ లక్ష్యమన్నారు. ఈ నెల 8న అన్ని మండలాల్లో ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చించాలని కోరారు.

మహిళలకు మా ప్రభుత్వం కల్పిస్తున్న లబ్ధి గురించి చర్చించాలని తెలిపారు. గ్రామలు, మండలాల్లో మహిళా సమాఖ్య సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ నెల 10 నుంచి 16 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. వడ్డీ లేని రుణాల నగదును చెక్కుల రూపంలో అందిస్తామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సాయంపై ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. అవకాశం ఉన్న ప్రతిచోటా మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణలో నేటి నుంచి పది రోజుల పాటు ఊరువాడ ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.