23-08-2025 12:00:00 AM
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినపల్లి: ఆగస్టు 22(విజయక్రాంతి ): గ్రామాల సమాఖ్య అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. శుక్రవారం బోయినపల్లి మండలం బోయినపల్లి. స్తంభం పెళ్లి గ్రామాలతో పాటు మరో కొన్ని గ్రామాల్లో పనుల జాతరలో భాగంగా అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమానంగా సంక్షేమ పథకాలు అందిస్తుందని ఆయన చెప్పారు.
ఈ వర్గాల ప్రజలు కూడా ఇందులో ఆందోళన గురి కావలసిన అవసరం లేదని ఆయన అన్నారు. అన్ని గ్రామాలకు మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. అందుకు ప్రభుత్వం ప్రత్యేక రూపకల్ప చేసి నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి తహసిల్దార్ భూపేష్ రెడ్డి. ఎంపీడీవో భీమా జయశీల, డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లా మాజీ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, బోయినపల్లి సింగిల్ విండో చైర్మన్ జోగినపల్లి వెంకట రామారావు,మాజీ ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, ఏఎంసి చైర్మన్ బోయిని ఎల్ ఎస్ యాదవ్,సెస్‌డైరెక్టర్