31-07-2025 12:17:53 AM
మేకల ఎల్లయ్య :
తెలంగాణ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) కేవలం ఒక రవాణా సంస్థ మాత్రమే కాదు. అది తెలంగాణ ప్రజల దైనందిన జీవితంలో అంతర్భాగం. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న రవాణా వనరు. గత కొన్ని దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రజలకు సురక్షితమైన, నమ్మకమైన రవాణా సేవలను అందిస్తూ వస్తోంది. సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా 10,460 బస్సులున్నాయి.
తన విస్తృత నెట్‌వర్క్‌తో రోజుకు సుమారు 35 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. రాష్ట్రంలో 36,593 రూట్లలో టీజీఎస్‌ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. వీటిల్లో కొన్ని రూట్లు తక్కువ దూరం, మరికొన్ని అంతర్రాష్ర్ట రూట్లూ ఉన్నాయి. రోజువారీ ప్రాతిపదికన, ఆర్టీసీ సుమారు 12,000 రూట్లను కవర్ చేస్తోం ది. చిన్న గ్రామాలు, పట్టణాలను మెట్రోపాలిటన్ నగరాలతోపాటు పొరుగు రా ష్ట్రాలను కలుపుతూ ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయి.
అయితే ఇటీవల ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నాలు ఊపందుకో వడం తీవ్రఆందోళన కలిగిస్తోంది. ము ఖ్యంగా హైదరాబాద్‌లో 3,000 ప్రైవేట్ బస్సులను దశలవారీగా ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు సిద్ధం కావడం, రూట్లను ఒ క్కొక్కటిగా ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించే విధానం ప్రజల భవిష్యత్‌పై తీవ్రప్రభావం చూపనుంది.
ఈ ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు ఎదురయ్యే సమస్యలు, ఆర్టీసీ ఆస్తుల భవిష్యత్, ఇతర ప్రభుత్వరంగ సంస్థలపై దాని ప్రభావం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ హక్కులపై తీవ్రమైన ప్రభావాలు ఉంటాయని పలువురు నిపుణులు హెచ్చరిస్తు న్నారు. అధికారికంగా ప్రకటించకపోయి నా, రవాణాశాఖ స్థాయిలో ప్రైవేట్ ఆపరేటర్లతో ఒప్పందాలు జరుగుతున్నట్టు స్ప ష్టమవుతోంది.
ఈ మార్పులు హైదరాబా ద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం వంటి ప్రధాన నగరాల్లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 2023లో కొన్ని రూ ట్లపై ప్రైవేట్ ఆపరేటర్లకు లీజు ప్రాతిపదిక న అనుమతి ఇవ్వడం, 2024లో హైదరాబాద్ నగరంలో 3,000 ప్రైవేట్ బస్సుల కు ఒప్పందాలు సిద్ధం కావడం వంటి పరిణామాలు ప్రైవేటీకరణ దిశగా జరుగుతు న్న పకడ్బందీ ప్రణాళికకు నిదర్శనం.
వేల కోట్ల సంపద ప్రైవేటు పరం
ఆర్టీసీ కేవలం బస్సులు, రూట్లకే పరిమితం కాదు. ఆర్టీసీకి సుమారు రూ. 8,000 కోట్ల ఆస్తులున్నాయి. వీటిలో 97 డిపోలు, 364 బస్‌స్టేషన్లు, వర్క్‌షాప్‌లతోపాటు భారీ మౌలిక సదుపాయాల నెట్ వర్క్ ఉంది. ఆర్టీసీకి సుమారు 1474.54 ఎకరాల భూమి ఉంది. ఈ భూములు కొన్ని ప్రధాన ప్రదేశాలలో ఉండటం వల్ల వాటి విలువ చాలా ఎక్కువ. అందుకే ఈ ఆస్తుల విలువ రూ. 8,000 కోట్లకు పైగా అంచనా వేయబడింది.
ముషీరాబాద్‌లో ని బస్ భవన్ పక్కన 9.14 ఎకరాల ప్రధా న భూమిని వాణిజ్య అభివృద్ధికి ఉపయోగించుకోవాలని సంస్థ యోచిస్తోంది. హైద రాబాద్‌లో సంస్థకు బస్‌భవన్ ప్రధాన కార్యాలయం, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ఎంజీబీఎస్), జూబ్లీ బస్‌స్టేషన్ (జేబీఎస్) తోపాటు సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు 2 స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలు ఉన్నాయి. ఆర్టీసీ ఆస్తులన్నీ ప్రజల సొత్తు.
ప్రైవేటీకరణ జరిగితే ఈ వేల కోట్ల ఆస్తులు బడా కార్పొ రేట్లకు అప్పగించబడతాయి. ప్రజలకు వాటిపై హక్కు లేకుండా పోతుంది. ప్రభు త్వ సంస్థలు అనేవి ప్రజలు చెల్లించిన ప న్నులతో నిర్మించబడతాయి. వాటిని ప్రైవే టు రంగానికి అప్పగించడం అంటే ప్రజల సంపదను కార్పొరేట్లకు ధారాదత్తం చేయడమే అవుతుంది.
సమానత్వానికి ముప్పే
ప్రజల హక్కుగా ఉన్న రవాణా సేవలు ప్రైవేటీకరించబడితే, రాజ్యాంగం కల్పించిన సమాన అవకాశాలతత్వం దెబ్బతిం టుంది. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన కనీస సేవలను వ్యాపార వస్తువు లుగా మార్చడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి వి రుద్ధం. ప్రభుత్వ సంస్థలు సామాజిక న్యా యాన్ని పాటిస్తూ, సమాజంలోని అన్ని వ ర్గాలకు సేవలను అందిస్తాయి. ప్రైవేట్ సం స్థలు లాభాపేక్షతో మాత్రమే పనిచేస్తాయి సామాజిక న్యాయం పట్ల వారికి బాధ్యత ఉండదు.
ప్రైవేటీకరణ వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ప్రైవేట్ బస్సు లు లాభాపేక్షతో నడుస్తాయి టికెట్ ధరలు భారీగా పెరుగుతాయి. ప్రభుత్వ రవాణా వ్యవస్థ పేద, మధ్య తరగతి ప్రజలకు అం దుబాటులో ఉండేలా చూస్తుంది. అయితే ప్రైవేటీకరణ ఈ సౌలభ్యాన్ని దూరం చేస్తుంది.
లాభం కోసమే పనిచేసే ప్రైవేట్ ఆపరేటర్లు, రద్దీ లేని సమయాల్లో లేదా తక్కువ లాభదాయకమైన రూట్లలో సేవలందించడానికి ఆసక్తి చూపరు. గ్రామీణ ప్రాంతాల్లోని లాభదాయకం కాని మార్గాలను ప్రైవేట్ ఆపరేటర్లు విస్మరిస్తారు. దీనివల్ల గ్రామీణ ప్రజలు రవాణా సౌకర్యాలను కోల్పోతారు. ఆర్టీసీలో 48,000 మందికి పైగా ఉద్యోగులున్నారు. ప్రైవేటీకరణ వల్ల వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్ అనిశ్చితంగా మారుతుంది.
భవిష్యత్‌లో ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందా?
తెలంగాణ ప్రభుత్వం ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. ఈ పథకం ద్వారా మహిళలు సురక్షితంగా, ఉ చితంగా ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వం ఇ చ్చిన సమాచారం ప్రకారం, 2025 మార్చి 19 నాటికి మహాలక్ష్మి పథకం కింద 149.63 కోట్ల మంది మహిళలు ఉచితం గా ప్రయాణించారు. ఈ ప్రయాణాల వి లువ రూ. 5,005.95 కోట్లు.
2024 మా ర్చి నాటికి, ఆర్టీసీకి రూ. 3,082.53 కోట్లు మహాలక్ష్మి పథకం కింద సహాయంగా కేటాయించినట్టు బడ్జెట్ పత్రాలు చెబుతున్నా యి. దీనికి అదనంగా ఆర్టీసీకి నెలకు సు మారు రూ. 350 కోట్ల చొప్పున ప్రభు త్వం చెల్లిస్తున్నట్టు రవాణాశాఖ మంత్రి ప్రభాకర్ 2024 మార్చిలో తెలిపారు.
తా జాగా మహాలక్ష్మి పథకం కింద మహిళలు టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేశారని మంత్రి పొన్నం జూలై 22, 2025న తెలిపారు. ఈ ప్రయాణాల మొత్తం విలువ సుమారు రూ.6,700 కోట్లుగా పేర్కొన్నారు. ఈ పథకం వల్ల ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 97 శాతానికి, రోజువారీ ప్రయాణికుల సంఖ్య 60.08 లక్షలకు, మహిళా ప్రయాణికుల వాటా 66.74 శాతానికి పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
నష్టాలను పూడ్చేందుకు ప్రైవేటీకరణే మార్గమా?
ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయన్న వాదన నిజమే కావచ్చు. కానీ ప్రైవేటీకరణే ఏకైక పరిష్కారం కాదు. ప్రత్యామ్నాయ మార్గా లు అనేకం ఉన్నాయి. ఆర్టీసీ ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ప్రభుత్వమే ని ధులు మంజూరు చేయాలి. ప్రజలకు సేవలను అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉం ది. లాభదాయకమైన రూట్లను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించకుండా, ఆర్టీసీకే కే టాయించాలి. ఇది సంస్థకు ఆదాయాన్ని పెంచి, నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
అది ప్రజల హక్కుల ఉల్లంఘనే
ఆర్టీసీ ప్రైవేటీకరణ అనేది కేవలం ఒక ప్రభుత్వ సంస్థను ప్రైవేటుపరం చేయడమే కాదు. ఇది ప్రజల హక్కుల ఉల్లంఘన. పౌరులు, విద్యార్థులు, కార్మికులు సంఘటితంగా ఈ ప్రైవేటీకరణ వ్యూహానికి వ్యతిరే కంగా ప్రతిఘటించాలి. ఇది ప్రజల హ క్కు ల కోసం, సామాజిక న్యాయం కోసం సాగే ఉద్యమం. ఈ కీలక సమయంలో ప్ర జలు తమ గళాన్ని వినిపించాలి. తమ హ క్కులను కాపాడుకోవాలి.
ఒకసారి ప్రజల బస్సు ప్రైవేటు చేతుల్లోకి వెళ్తే, దాని వెంట విద్య, వైద్యం, నీరు అన్నీ వ్యాపార వస్తువులవుతాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. ప్రభుత్వాలు ప్రజల కో సం పనిచేయాలి. కార్పొరేట్ల కోసం కాదు. ఇప్పటికైనా మేల్కొని, ఆర్టీసీని బలోపేతం చే యడానికి, ప్రజల బస్సును ప్రజలకే దక్కే లా చేయడానికి అందరూ కలిసికట్టుగా కృ షి చేయాలి.
లేకపోతే భవిష్యత్‌లో ప్రజల కు అందుబాటులో ఉన్న సేవలు, సౌకర్యా లు అన్నీ వ్యాపార సంస్థల గుప్పిట్లోకి వెళ్లి, సామాన్య ప్రజల జీవితం మరింత దుర్భరంగా మారుతుంది. ఆర్టీసీని బలోపేతం చేయడం ద్వారా, తెలంగాణ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందవచ్చు.
వ్యాసకర్త సెల్: 9912178129