22 August, 2026 | 2:29 AM

ప్రిన్సిపాల్ హత్యపై ప్రైవేట్ స్కూళ్ల బంద్

22-08-2026 01:33 AM

గద్వాల టౌన్, ఆగస్టు 21: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ జోగుళాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం ప్రైవేట్ పాఠశాలలు బంద్ పాటించాయి. ట్రస్మా ఆధ్వర్యంలో పాతబస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. హత్యకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ పాఠశాలల సిబ్బందికి భద్రత కల్పించాలని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు బాబు నాయుడు, గౌరవాధ్యక్షుడు బీచుపల్లి, ప్రధాన కార్యదర్శి మోహిన్ బాష, రాష్ట్ర కమిటీ సభ్యుడు త్యాగరాజు డిమాండ్ చేశారు.