18-09-2025 05:46:45 PM
ఎమ్మెల్యే పాయల్ శంకర్..
అదిలాబాద్ (విజయక్రాంతి): సమాజానికి స్ఫూర్తినిచ్చేలా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం నుండి మొదలుకొని మహాత్మ గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీ వరకు బీజేపీ పార్టీ శ్రేణులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) అన్నారు. నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సేవ పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ లోని ఖానాపూర్ చెరువు కట్ట వద్ద బతుకమ్మ ఘాట్ లో గురువారం నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ శ్రేణులతో కలిసి బతుకమ్మ ఘాట్ వద్ద చెత్త తొలగించారు.
ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రపంచమంతా సమర్థిస్తుందని అన్నారు. దేశ ప్రజలందరూ కోరుకున్న విధంగా ప్రపంచానికే భారతదేశ నాయకత్వం వహించాలనే విధంగా ప్రధాని మోదీ నేతృత్వంలో ఆ దిశగా దేశం పయనిస్తుందన్నారు. ఏక్కడ ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ నరేంద్ర మోడీ నేతృత్వంలో మూడవ స్థానం దగ్గరలో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానంద్, నాయకులు గందే విజయ్ కుమార్ జోగు రవి, రాజేష్, దినేష్ మాటోలియా, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.