11-01-2026 12:00:00 AM
ఉప్పల్, జనవరి 10 (విజయక్రాంతి) : మురుగునీరు చేరకుండా అరికట్టేందుకు కోటి 80 లక్షల రూపాయల వ్యయంతో జిహెచ్‌ఎంసి ఇరిగేషన్ చేపట్టిన సివరేజ్ డైవర్షన్ పనులు గత మూడు సంవత్సరాల క్రితం శంకుస్థాపన జరిగినప్పటికీ పనులు సుమారు 80 శాతం మాత్రమే పూర్తిచేసి మధ్యలోనే నిలిపివేయడం పై జిహెచ్‌ఎంసి విజిలెన్స్ కమిషనర్ అధికారులకు నాచారం కార్పోరేటర్ శాంతి ఫిర్యాదు మేరకునాచారం డివిజన్ ఎర్రకుంట లోని పటేల్ కుంట చెరువు జిహెచ్‌ఎంసి విజిలెన్స్ అధికారులు శనివారం పరిశీలించారు.
ఈ సంద ర్భంగా కార్పొరేటర్ శాంతిసాయిజెన్ ఈ అసంపూర్తి పనుల వల్ల చెరువులోకి మురుగునీరు యథావిధిగా చేరుతుండటంతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజిలెన్స్ అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి విజిలెన్స్ అధికారులు ఇన్స్పెక్టర్ అమృత రెడ్డి ఏ ఈ రోహిత్ రెడ్డి ఇరిగేషన్ ఏ ఈ ఆంజనేయులు బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ విఠల్ యాద వ్ కట్ట బుచ్చన్న గౌడ్ మంగోల్ శివకుమార్ చంద్రశేఖర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.