01-08-2025 11:14:25 PM
ఎన్డీఆర్ఎఫ్ ప్రదర్శన..
మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రకృతి వైపరీత్యాల సమయంలో అప్రమత్తంగా ఉండేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళం(NDRF force) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ సహకారంతో డెమో నిర్వహించారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, ఉరుములు మెరుపులు, గ్యాస్ లీకేజీ ప్రమాదాల నుండి ఎలా బయటపడాలనే విషయంపై ఎన్డీఆర్ఎఫ్ దళం సభ్యులు ప్రదర్శన నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ చంద్ర రాజేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ సదానందం, ఎస్ఐ సూరయ్య, ఎన్ డి ఆర్ ఎఫ్ కెప్టెన్లు పాల్గొన్నారు.