మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తుంది
ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల, ఆగస్టు 6: మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ మత్స్యశాఖ సహకార సంఘం (సొసైటీ) నూతన చైర్మన్గా ఎన్నికైన నూతి వెంకటేశంను, అలాగే నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లను ఆయన శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. నూతన పాలకవర్గం సమిష్టి స్ఫూర్తితో పనిచేసి సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సభ్యులందరి విశ్వాసాన్ని నిలబెట్టేలా పారదర్శకంగా పనిచేసి సంఘాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్దకాపర్తి సర్పంచ్ కాటం వెంకటేశం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య, సీనియర్ నాయకుడు గుడిపాటి లక్ష్మీనరసింహ, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మత్స్యశాఖ సహకార సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు.






