నగరపాలక సంస్థలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
ముకరంపుర, ఆగస్టు 6(విజయక్రాంతి): తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. గురువారం డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, పలువురు కార్పొరేటర్లు, అధికారులతో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడూతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కాంక్షను ప్రజల్లో రగిలించి ఉద్యమానికి సైద్ధాంతిక భూమికను అందించడంలో జయశంకర్ సార్ పాత్ర చిరస్మరణీయమని తన జీవితాన్ని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంకితం చేసిన గొప్ప మహాణీయులని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను అడుగడుగునా వివరించారని గుర్తుచేశారు. నేటి యువత జయశంకర్ సార్ నూ స్పూర్తిగా తీసుకొని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్పొరేటర్లు సౌగాని కొమురయ్య, సరిల్ల రాజకుమారి ప్రసాద్, అదనపు కమీషనర్ ఆయాజ్, డిప్యూటీ కమీషనర్లు ఖాధర్ మొహియుద్దీన్, వేణుమాధవ్, వెటర్నరీ అధికారి దుర్గాప్రసాద్ రెడ్డి, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.






