7 August, 2026 | 3:51 PM

సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు ప్రారంభం

06-08-2026 12:53 PM

ప్రారంభించిన సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధనుంజయ నాయుడు.

నేరేడుచర్ల,ఆగస్టు 06(విజయ క్రాంతి): దేశంలో ప్రధాని మోడీ, అమిత్ షా ల ద్వయం ప్రతిష్ట మసకబారుతోందని ఇటీవల జరిగిన పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయని ఇది దేశానికి ఎంతో శుభసూచకమని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు వ్యాఖ్యానించారు. గురువారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల లో సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్ర కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ,గత 12 సంవత్సరాలుగా అధికారం లో ఉండి ఆడిందే ఆటగా పాడిందే పాటగా వారు వ్యవహరించారని, కానీ నీట్ పరీక్ష పత్రం లీకేజీతో వారి దుష్ట పరిపాలనకు చరమగీతం పాడేందుకు అంకురార్పణ జరిగిందని, జనతా కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో వెల్లువెత్తిన నిరసన కార్యక్రమం దేశాన్ని కుదిపివేసిందని, మొట్ట మొదటిసారిగా ఒక కేంద్ర మంత్రి చేత విద్యార్థులు, యువకులు రాజీనామా  చేయించారని అలాగే బీహార్ లోని బంకిపూర్ నియోజకవర్గంలో బిజెపి దారుణంగా ఓడిపోయిందని గుజరాత్ కూడా గతంలో లక్ష ఓట్లు మెజార్టీతో గెలిచినవారు.

నేడు 30వేల ఓట్ల తో గెలవడం చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా ఉన్నదని,అలాగే ఝార్ఖండ్ రాష్ట్రంలో కూడా విద్యార్థులు ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ పార్లమెంట్ సమావేశాల్లో అడ్డదారిలో దొడ్డిదారిలో ఇతర పార్టీలను చీల్చి డీ -లిమిటేషన్ బిల్లు పెట్టేందుకు ప్రయత్నం చేసి చివరకు నోరు మూసుకోవాల్సి పరిస్థితి దాపురించిందని ఫక్తు అబద్ధాలతో పరిపాలన కొనసాగిస్తున్నారని  సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని,నల్ల డబ్బు వెనక్కి తెచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్ష రూపాయలు వేస్తామని ₹50 రూపాయలకె పెట్రోల్ డీజిల్ అందుబాటు లో ఉంచుతామని బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని పెహల్గావ్ ఉగ్రవాదులు భూమి అంచులో ఎక్కడ ఉన్నా పట్టి తెస్తామని ఉత్తరప్రగల్బాలు పలికారని మరి ఏమైందని ఆయన ప్రశ్నించారు 

ఈ కార్యక్రమంలో మండల సిపిఐ కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రావుల సత్యం, మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్  A లక్ష్మి, ఏఐటీయూసీ ప్రాంతీయ  సహాయ కార్యదర్శి ముత్యాల భాస్కర్ మండల అధ్యక్షుడు ఊదర వెంకన్న రైతు సంఘం మండల కార్యదర్శి కటికోల వెంకన్న  బీసీ హక్కుల సాధన సమితి జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్, మండలాధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు పరికె భరత్ దోమకొండ మనోజ్ పోలగాని రవి బాల సైదా ఎస్.కె హుస్సేన్ చిలకరాజు సైదులు పి రామరాజు డి శ్రీనివాస్ పాల్గొన్నారు.