ప్రముఖ రచయిత జైశెట్టి రమణయ్య కన్నుమూత
నివాళులర్పించిన పలువురు
జగిత్యాల, మార్చి 27(విజయక్రాంతి):జై శెట్టి రమణయ్య శుక్రవారం కన్నుమూశారు. జగిత్యాలకు చెందిన ఆయన తెలంగాణ చరిత్రకారులు పరిశోధకులు. తెలంగాణ చరిత్ర, ముఖ్యంగా శాతవాహనుల కాలం నాటి అం శాలపై ఆయన అధ్యయనం చేశారు. తెలంగా ణ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష 2023 లో, శాతవాహనుల మొదటి రాజధాని ఏది అని అడిగిన ప్రశ్నలో ఈయన పేరు ప్రస్తావించబడింది,
ఆయన ప్రధానంగా శాతవాహను ల పాలన, వారి భౌగోళిక విస్తరణ ప్రాచీన తెలంగాణ చరిత్రపై దృష్టి సారించారు. తెలంగాణ చరిత్ర సంస్కృతిపై ఆయన చేసిన అధ్య యనాలు స్థానిక చారిత్రక పరీక్షల్లో ప్రస్తావించ బడ్డాయి. ఇంకా శాతవాహనుల చరిత్ర కు సంబంధించి ఆయన అధ్యయనాల విరివిగా ఉన్నాయి.
జైశెట్టి రమణయ్యకు నివాళి: బీఎస్ రాములు
నిండు జీవితాన్ని గడపడం ఎలానో ఆచరించి చూపిన ఆదర్శ జీవి గురుతుల్యులు, ప్రముఖ చరిత్ర కారులు , విద్యావేత్త. వేలాదిమంది ని తీర్చి దిద్దిన మహా అధ్యాపకుడు జైశెట్టి రమణయ్య ఈరోజు కాలం చేసిన సందర్భంగా నివాళి.వారి స్వీయ చరిత్ర, 70 ఏళ్ల డైరీలు రచనలు జగిత్యాల వైశిష్ట్యం సమాజ పరిణామాల దర్శిని, విద్యారంగ దశాబ్దాల ప్రత్యక్ష అనుభవాల సంపుటి, కుటుంబం ఉమ్మడి కుటుంబం ఎలా ఎదుగుతూ అనేక శాఖలుగా, శాఖోపశాఖలతో ఎలా విస్తరిస్తూ వచ్చిందో రికార్డు చేసిన అపూర్వ అనితరసాధ్య రచన.
దక్షిణ భారత దేవాలయాలు, కరీంనగర్ జిల్లా పలు క్షేత్రాల చరిత్రను పీహెచ్‌డీతో ప్రామాణికంగా నిలిపిన వారు రమ ణయ్య. వారి డైరీ రికార్డులు నా స్వీయ చరిత్ర రచనకు ఒక ఆధార గ్రంథంగా నిలిచింది. టీచర్స్ డే సందర్భంగా ప్రతి ఏటా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి బహుమతులు ప్రదానం చేస్తూ వచ్చారు. వారి స్ఫూర్తి తో ఎందరో ఉపాధ్యాయులు విద్యార్థులు ఎదిగారు.




