13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

మునుగోడులో ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ

28-03-2026 12:50 AM

మునుగోడు, మార్చి 27 : మునుగోడు పట్టణంలో  శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం భక్తులు ప్రసన్నాంజనేయ స్వామి 15  అడుగుల ఎత్తున విగ్రహమును ఆవిష్కరింపజేశారు. కార్యక్రమంను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రారంభిం చారు. అనంతరం హనుమాన్ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో తన సతీమణి లక్ష్మితో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం మునుగోడు పట్టణంలోని పురాతన శివరామ ఆలయంను, కొంపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయం, కొంపల్లి శివారు తూర్పు గూడెం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, చీకటి మామిడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాల్లో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో  ఎమ్మెల్యే దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.