calender_icon.png 19 May, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

05-04-2025 12:00:00 AM

హనుమకొండ, ఏప్రిల్ 4 (విజయ క్రాంతి): కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు హనుమకొండలో రైతు సత్యాగ్రహ దీక్ష ఘనంగా నిర్వహించబడింది. హనుమకొండ బీజేపీ జిల్లా అధ్యక్షులు  కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ దీక్షలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా, కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి  గోలి మధుసూదన్ రెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అజ్మీర్ సీతారాం నాయక్ , మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, హనుమకొండ మాజీ జిల్లా అధ్యక్షురాలు  రావు పద్మ, వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, డా. కాళీ ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బీజేవైఎం నాయకులు ,జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, కిసాన్ మోర్చా నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.