calender_icon.png 19 May, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ

05-04-2025 12:00:00 AM

జనగామ, ఏప్రిల్ 4(విజయక్రాంతి): క్రీస్తుజ్యోతి మినిస్ట్రీస్ ఫౌండర్, ప్రవక్త రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజు  జన్మదినం సందర్భంగా జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. సొసైటీ ఆఫ్ క్రైస్ట్, సొసైటీ ఆఫ్ గెత్సేమనే సోషల్ సర్వీస్, కరుణాపురం సంయుక్త అధ్వర్యంలో జనగామ గెత్సేమనే ప్రార్థన మందిరం సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఇనుముల నర్సయ్య, జి.వై.గిరి పౌండేషన్ చైర్మన్ జి.కృష్ణ, గెత్సేమనే ప్రార్థన మందిరం సంఘ పెద్ద మెకానికల్ రవి తదితరులు పాల్గొన్నారు.