04-04-2025 11:56:07 PM
చేర్యాల: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి, అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు. చేర్యాల పట్టణంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొమురెల్లి మండలానికి సంబంధించిన వివిధ విభాగాల మండల కమిటీలను మండల పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎన్నికైన సభ్యులను ప్రతాపరెడ్డి సన్మానించారు. ఆయన మాట్లాడుతూ గ్రామ గ్రామాన పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని సూచించారు. బీసీ సెల్ అధ్యక్షులుగా గొల్లపెల్లి శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా చుంచు శ్రీనివాస్, ఎస్టీ సెల్ రాజలింగం, కిసాన్ సెల్ అధ్యక్షులుగా వచ్చు ఎల్లయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షులుగా ఎండి జాంగిర్, సేవాదళ్ అధ్యక్షులుగా బుడిగె అశోక్, మండల పార్టీ కార్యదర్శిగా సార్ లింగం లు ఎన్నుకున్నట్లు వారు తెలిపారు.