calender_icon.png 24 February, 2026 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు తీర్పు ప్రకారం హామీలను నెరవేర్చాలి

24-02-2026 12:00:38 AM

ఉమ్మడి నల్గొండ జిల్లా మలిదశ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాయపూడి వెంకట్ నారాయణ

కోదాడ, ఫిబ్రవరి 23: హైకోర్టు తీర్పు ప్రకారం హామీలను నెరవేర్చాలని ఉమ్మడి నల్గొండ జిల్లా మలిదశ సంక్షేమ సంఘం అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయపూడి వెంకట్ నారాయణ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ మలిదశ ఉద్యమకారులకు ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఉద్యమకారులు హైకోర్టులో పిటిషన్ వేయగా హైకోర్టు అందుకు స్పందించి ఉద్యమకారులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది.

అభయ హస్తం స్కీము కింద అప్లై చేసుకున్న ఉద్యమకారులకు  250 చదరపు గజముల స్థలము, నెలకు 25 వేల రూపాయల పెన్షన్  8 వారాల్లోగా ఇవ్వాలని ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శికి, ఫ్రీడమ్ ఫైటర్ శాఖకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది హైకోర్టులో వాదనలు జరిగినప్పుడు ప్రభుత్వం కూడా దీనిపై అనుకూలంగా స్పందించడం వల్ల సమస్య పరిష్కారమైంది ఇందుకు ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.