calender_icon.png 30 October, 2025 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధునిక వైద్యంతో బ్రెయిన్ స్ట్రోక్ నుంచి రక్షణ

29-10-2025 01:26:14 AM

‘కిమ్స్’ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డా.సుభాష్ కౌల్

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు, వికలాంగతకు ప్రధాన కారణాల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి. దీనిని వేగంగా గుర్తించడం ద్వారా ఆధునిక వైద్యం అందించి అనేక ప్రాణాలను రక్షించవచ్చు, వికలాంగతను తగ్గించవచ్చు అని డా. సుభాష్ కౌల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. “కిమ్స్ సికింద్రాబాద్ స్ట్రోక్ సర్వీసులు 24 గంటల సమగ్ర స్ట్రోక్ సేవలను అందిస్తున్నాయి. అత్యవసర స్ట్రోక్ స్పందన బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుంది.

ఇస్కీమిక్ స్ట్రోక్ రోగులకు ఇంట్రావీనస్ థ్రోంబోలిసిస్, పెద్ద రక్తనాళాల బ్లాకులకు మెకానికల్ థ్రోంబెక్టమీ ఆధునిక న్యూరోఇంటర్వెన్షనల్ పద్ధతులతో ప్రత్యేకమైన స్ట్రోక్ ఐసీయూ, మానిటరింగ్ యూని ట్లు, స్ట్రోక్ కారణాన్ని గుర్తించడానికి ఆధునిక ల్యాబొరేటరీ సేవలు  భవిష్యత్తులో మళ్లీ స్ట్రోక్ రాకుండా నిరోధక చికిత్సలు, సమగ్ర పునరావాస సేవలు, ఫిజియోథెరపీ, ఆక్వుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ సౌకర్యాలతో ఉన్నాయి. 

స్ట్రోక్ లక్షణాలు

ముఖం వంకర పోవడం, చేయి బలహీనత, మాటలలో ఇబ్బంది. ఈ లక్షణాల్లో ఏదైనా కనిపించిన వెంటనే, ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తీసుకెళ్లాలి. పక్షవాతం బారిన పడకుండా ఉండుటకు కారకాలైన. బిపి, షుగర్, కొలెస్ట్రాల్, ఉభకాయం, మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు ఉన్న వారు వైద్య పరవేక్షణలో ఉండడం, ప్రతి రోజు వ్యాయామం చేయడం, సరైన ఆహారం తీసుకోవటం వంటి అలవాట్లను అలవరుచుకోవడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చు.