26 May, 2026 | 4:25 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

వేల కోట్ల భూమికి రక్షణ

13-02-2026 12:00 AM

హైటెక్ సిటీలో భారీ కూల్చివేతలు 

రూ.2,200 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా 

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): మాదాపూర్ హైటెక్ సిటీ మొండికుంట చెరువును ఆనుకుని ఉన్న 11 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా కాకుండా గురువారం హైడ్రా కాపాడింది. అధికారుల అంచనా ప్రకారం ఈ భూమి విలువ సుమారు రూ.2,200 కోట్లు. ఖానామెట్ పరిధిలోని సర్వే నంబర్లు 53, 55లో అక్రమ కట్టడాలు వెలిసినట్టు ప్రజావాణిలో ఫిర్యాదులు అందడంతో హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు.

చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో తాత్కాలిక షెడ్లు, మెకానిక్ కేంద్రాలు, ఐరన్, స్టీల్ దుకాణాలు ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ముందస్తు నోటీసులు ఇచ్చిన అనంతరం భారీ పోలీసు బందోబస్తు మధ్య వందలాది షెడ్లు, 30కి పైగా వాణిజ్య దుకాణాలను తొలగించారు. ఆక్రమణలను ఖచ్చితంగా నిర్ధారించేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి సేకరించిన శాటిలైట్ చిత్రాలను పరిశీలించిన అధికారులు గత నెల నిర్వహించిన విచారణలో ఈ భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఒక ఆలయ ప్రహరీ గోడను సాకుగా చూపుతూ చుట్టుపక్కల భూమిని ఆక్రమించి నెలకు భారీ అద్దెలు వసూలు చేస్తున్న వ్యవహారాన్ని కూడా గుర్తించారు.