24 July, 2026 | 3:23 AM

రాహుల్ గాంధీ అరెస్టుపై నిరసన

24-07-2026 12:00 AM

మొయినాబాద్ జూలై 23(విజయ క్రాంతి): ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మొయినాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొయినాబాద్ చౌరస్తా వద్ద భారీ నిరసన ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.