24 July, 2026 | 3:24 AM

రైతులను మోసగించినోళ్లు కుష్టుగ్రస్తులైతరు!

24-07-2026 12:00 AM
  1. ఎమ్మెల్యే ప్రధాన అనుచరులే నకిలీ డిఏపి సూత్రదారులు
  2. బారసాల ఫంక్షన్లకే పరిమితమైన ఎమ్మెల్యే
  3. మాజీ ఎమ్మెల్యే మర్రి

నాగర్‌కర్నూల్ జూలై 23 ( విజయక్రాంతి )యావత్ దేశానికి వెన్నెముకగా ఉన్న రైతన్నలను నకిలీ ఎరువులు అంటగట్టి మోస గించేటోళ్లకు, వారిని కాపాడుతున్న వారికి కుష్టు రోగం వచ్చి తీరుతుందని మాజీ ఎ మ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తన నివాసంలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ ప్రాంత రైతులకు నకిలీ డిఏపి ఎరువులను అంట గట్టడంతో స్థానికంగా ఎరువుల కొరత ఏర్పడిందన్నారు.

రోజుకో రైతు తన అన్యాయం జరిగిందని నకిలీ ఎరువుల బస్తాలను కలెక్టరేట్కు తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడిందని ఎందుకు కారణం ఎవరో స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. వ్యవసాయ, పోలీస్ శాఖ అధికారులు 20 రోజులు దర్యాప్తు జరిపినట్లు హంగామా చేస్తూ నకిలీ బిజెపి ఎరువు లను రైతులకు అంట కట్టిన ముఠాను పట్టుకున్నట్లు పట్టుకొని అదే రోజు రాత్రి విడి చిపెట్టారని ఇందుకు మతలపెంటో చెప్పాలన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన రీతిగా పోలీసుల వ్యవహార శైలి దాపురించిందన్నారు.

హైదరాబాద్ అంబర్పేట ప్రాంతం కేంద్రంగా 150 రూపాయలు చొప్పున నకిలీ ఎరువుల బస్తా తయారు చేసి 1600 కు ఒక బస్తా చొప్పున రైతులకు అంటగట్టి కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ప్రధాన అనుచరులే ఈ నకిలీ డిఏపి ఎరువుల సరఫరా ప్రధాన నిందితులని వారిని ఎవరు కాపాడుతున్నారని ప్రశ్నించారు. నకిలీ విత్తనాలు లేదా ఎరువులు సరఫరా చేసిన వారిపై పీడియాట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే సహచరులే నిర్భయంగా అక్రమ వ్యాపారాలు సాగిస్తున్నారని ఆరోపించారు. రైతులను మోసగించే వారు కుష్టు రోగం వచ్చి పోతారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి వైద్యుడిగా ఉన్నప్పటికీ స్థానిక జనరల్ ఆస్పత్రిలో వైద్యులు ఎంతమందో తెలిసే పరిస్థితి లేదన్నారు.

ఇప్పటివరకు తాగునీరు సాగునీరు వంటి శాఖలపై రివ్యూ నిర్వహించిన దాఖలాలు లేవని కేవలం బారసాల ఫంక్షన్లకే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. స్థానిక రైస్ మిల్లర్స్ నుంచి ఎంత డబ్బు వసూలు చేశారో తన వద్ద పూర్తి లెక్కలు ఉన్నాయని  కలెక్టరేట్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ యాడికైనా చర్చకు సిద్ధమేనన్నారు. నకిలీలను అసలు దోషులను శిక్షించకుంటే ప్రత్యేక కార్యాచరణగా కలెక్టరేట్ ముందే వంటావార్పు చేపడతానని హెచ్చరించారు.