27 March, 2026 | 3:49 AM

నీటి సమస్య పరిష్కరించాలని ఆందోళన

27-03-2026 01:14 AM

నల్లగొండ టౌన్, మార్చి 26: మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నీటి సమస్య ఏర్పడడంతో విద్యార్థులు గురువారం ఆందోళన దిగారు. గత నెలరోజులు విద్యార్థులు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు యూనివర్సిటీ అధికల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆందోళన చేపట్టారు.

అధికారులు తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించడంతో రోడ్డు మీదనే స్నానాలు చేయడం అవమానకరంగా భావించారు హాస్టల్ గదిలో నీటి కోసం ఏర్పాటుచేసిన పైప్లైన్ కనెక్షన్లు సక్రమంగా లేకపోవడంతో హాస్టల్ వద్ద ఉంచిన ట్యాంకర్ వద్దని రోడ్డుపై స్నానాలు వాపోయారు యూనివర్సిటీలో చేపట్టే భవన నిర్మాణాలకు నీటిని మల్లీస్తున్న అధికారులు హాస్టల్లో విద్యార్థులకు నీటి సమస్యను పరిష్కరించడం లేదని ఆరోపిస్తున్నారు సమస్యలు పరిష్కరిస్తామని రిజిస్టర్ అంజిరెడ్డి హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.