డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలని నిరసన
కోహెడ, జూన్ 22: వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేసిన.. కోహెడ డంపింగ్ యార్డ్ ను రద్దు చేయాలని.. తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల వద్ద వెంకటేశ్వర్లపల్లి గ్రామ ప్రజలు ఆందోళన చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ పండుగ శ్రీకాంత్ మాట్లాడుతూ.. కోహెడ బాడుగు చెర్వు వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ ను తమ గ్రామానికి సమీపంలో ఏర్పాటు చేయడం సరికాదన్నారు.
తమ గ్రామానికి వాయు కాలుష్యం హాని తలేత్తనుందని, డంపింగ్ యార్డ్ ను రద్దు చేయాలని.. మంత్రి పొన్నం ప్రభాకర్ కు గతం లోనే తమ గ్రామస్తులతో కలిసి వినతి పత్రాన్ని అందించమన్నారు. పొడి చెత్త, తడి చెత్త ను సాంకేతిక యంత్రంను మంజూరు చేసి డంపింగ్ యార్డ్ ను కోహెడ లోనే ఉంచాలన్నారు. డంపింగ్ యార్డ్ ను రద్దు చేయాలని.. తహసీల్దార్ నవీన్ కుమార్ , ఎంపీడీఓ కృష్ణయ్య లకు వినతి పత్రాన్ని అందించినట్లు చెప్పారు.






