తాండూరులో ప్రత్యేక మహిళా గ్రామసభ
నాగిరెడ్డిపేట్ జూన్ 22 (విజయ్ కాంతి):మండలంలోని తాండూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక మహిళ గ్రామసభ నిర్వహించడం జరిగింది.మహిళ స్నేహపూర్వక గ్రామపంచాయతీని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ యాద గౌడ్ మాట్లాడుతూ...యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాఃయత్రైతాస్తు నపూజ్యంతే సర్వాస్తత్రాఫలా క్రియా అని తెలపడం జరిగింది.ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారు.
అక్కడ దేవతలు సంచరిస్తారు.ఎక్కడ స్త్రీలను పూజించరో అక్కడ జరిగే సత్కర్మలకు విలువ ఉండదని దీని అర్థం.ఈ సందర్భంగా క్రింది విషయాల పైన చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూమా యాద గౌడ్,ఉప సర్పంచ్ అభిషేక, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ దివిటీ కిష్టయ్య, విలేజ్ ప్రెసిడెంట్ సంగయ్య ఏపిఎం దత్తు,సెక్రటరీ కార్తిక్ మహిళా సంఘాల అధ్యక్షులు, మహి ళా వార్డు సభ్యులు పాల్గొనడం జరిగింది.






