calender_icon.png 22 December, 2025 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూర్మావతారంలో దర్శనమిస్తున్న భద్రాద్రి రామయ్య

22-12-2025 12:00:00 AM

భద్రాచలం, డిసెంబర్ 21, (విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసా గుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు స్వామివారు కూర్మావతారం లో భక్తులకు దర్శనమిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.కూర్మావతారంలో స్వామివా రి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో ఆలయం మొత్తం భక్తులతో కలకలలాడింది.

అంతేకాకుండా క్రిస్టమస్ సెలవులు విద్యార్థులకు ప్రకటించడం, ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు రామయ్య దర్శనానికి పోటెత్తారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు.వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను పురస్కరించుకొని దేవస్థానం అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యా లు కలగకుండా తగిన ఏర్పాట్లు చేపట్టారు.