25 March, 2026 | 2:19 PM

Breaking News

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదు: భారత్ పెట్రోలియం ప్రకటన   •   కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ పెన్షనర్స్ నిరసన   •   పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన జనం.!   •   సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •  

బంగ్లాదేశ్ ప్రధాని నివాసాన్ని ముట్టడించిన ఆందోళన కారులు

05-08-2024 03:11 PM

ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని నివాసాన్ని ఆందోళన కారులు ముట్టడించారు. ఢాకా ప్యాలెస్ వీడి ప్రధాని సురక్షిత ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బెంగాల్ వెళ్తున్నట్లు సమాచారం. షేక్ హసీనా బంగబాబన్ నుంచి మిలిటరీ హెలికాప్టర్ లో బయలుదేరారు. తన సోదరి షేక్ రెహానాతో కలిసి బెంగాల్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ మద్దతుదారులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. బంగ్లా ప్రధాని షేక్  హసీనా తన పదవికి రాజీనామా చేయాలని నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనల్లో మృతుల సంఖ్య 300కి చేరింది. కాగా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్లు అక్కడ మీడియా కథనాలు వెల్లడించాయి. రిజర్వేషన్ల ఆందోళనలో వందల మంది మృతి చెందిన గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో కర్ఫ్యూ విధించారు.