25 March, 2026 | 12:46 PM

Breaking News

సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •   అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి   •   రాష్ట్రంలో ఇంధన కొరత లేదు.! తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన   •   తెలంగాణలో పెట్రోల్ కొరత.. సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్   •   పెట్రోల్‌ బంక్‌ల దగ్గర భారీగా క్యూ.. వదంతులతో జనం పరుగులు   •  

కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

05-08-2024 02:26 PM

న్యూఢిల్లీ: సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్‌లోని రావు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో ముగ్గురు సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు మరణించిన ఘటనపై సుప్రీంకోర్టు సోమవారం సుమోటోగా విచారణ చేపట్టి కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల జీవితాలతో కోచింగ్ సెంటర్లు ఆడుకుంటున్నాయని న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ఘటన ఓ కనువిప్పు అన్న సుప్రీం కోర్టు భద్రతా ప్రమాణాలు పాటించే కోచింగ్ సంస్థలకు అనుమతివ్వాలని ఆదేశించింది.